Women Health: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే..!

Women Health: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే..!


ప్రస్తుత రోజుల్లో మహిళలను ఎక్కువగా భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో రొమ్ము క్యాన్సర్ (Breast cancer) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే చాలా మంది దీని గురించి సరైన అవగాహన లేక.. లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్‌ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ వ్యాధికి కారణాలు ఏంటి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జన్యుపరమైన కారణాలు (Genetic Factors)

మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లయితే.. మీకు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. BRCA1, BRCA2 వంటి జన్యువులలో మార్పులు (Genetic mutations) ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఒకవేళ మీ కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే.. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

జీవనశైలి అలవాట్లు (Lifestyle Factors)

  • ఆహారం.. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషకాహారం లేకపోవడం.
  • శారీరక శ్రమ.. వ్యాయామం లేకపోవడం.
  • బరువు.. అధిక బరువు లేదా ఊబకాయం.
  • చెడు అలవాట్లు.. పొగతాగడం, మద్యం సేవించడం.
  • మానసిక ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి.
  • నిద్రలేమి.

ఈ అలవాట్లు ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

రొమ్ము క్యాన్సర్‌ ను గుర్తించే లక్షణాలు

  • గడ్డలు (Lumps).. రొమ్ములో లేదా చంక కింద ఏదైనా గడ్డ లేదా ఉబ్బరం ఏర్పడటం. ఇది నొప్పి లేకుండా ఉండవచ్చు.
  • స్రావం (Discharge).. చనుమొన నుంచి రక్తం లేదా ఇతర ద్రవాలు రావడం.
  • పరిమాణంలో మార్పు (Change in size).. రొమ్ముల ఆకారం లేదా పరిమాణంలో తేడా రావడం. ఒక రొమ్ము చిన్నగా లేదా పెద్దగా మారడం.
  • చనుమొన మార్పులు (Nipple changes): చనుమొన లోపలికి లాగబడినట్లు ఉండటం, ఎర్రగా మారడం లేదా నొప్పిగా ఉండటం.
  • చర్మ మార్పులు (Skin changes): రొమ్ముపై చర్మం ఎర్రగా, గట్టిగా మారడం లేదా గరుకుగా మారడం.

రొమ్ము క్యాన్సర్ నివారణ మార్గాలు

  • ఆరోగ్యకరమైన జీవనశైలి.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండటం.. పొగతాగడం, మద్యం సేవించడం మానేయాలి.
  • ప్రతి మహిళా తన రొమ్ములను తానే తరచుగా పరీక్షించుకోవాలి. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా మామోగ్రామ్ (Mammogram) పరీక్ష చేయించుకోవాలి.

చికిత్స

ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే.. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. కానీ ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడడం కష్టం కావచ్చు.

రొమ్ము క్యాన్సర్ అవగాహన లోపం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి.. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బహిరంగంగా మాట్లాడటం, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *