మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తీరం నుంచి కొద్ది దూరంలో ఒక పడవ బోల్తా పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అందులో ఉన్న ప్రయాణికులందరూ మునిగిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. బృందాలు తాళ్ల సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి ఒక హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం.. కొందరు మత్స్యకారులు చేపలు పట్టేందుకు పడవలో వెళ్లగా.. వాళ్లు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు నీట మునిగి ఉండవచ్చని.. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు కూడా మునిగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది.. ప్రమాదంలో ఎంత మంది చిక్కుకున్నారు. అనేది వివరాలు ఆపరేషన్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని.. ఎన్‌సిపి నాయకుడు సునీల్ తత్కరే పేర్కొన్నారు.
వీడియో చూడండి..
रायगड समुद्रात बोट बुडाली आहे. बचाव पथकाकडून युद्धपातळीवर बचावकार्य सुरू आहे.#Raigad #BoatAccident #RescueOperation #BreakingNews #Maharashtra #SeaAccident #DisasterUpdate #IndiaNews pic.twitter.com/QZOT5vr9Zi
— SakalMedia (@SakalMediaNews) August 21, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.