Watch Video: ఛీ.. ఛీ ఇదేం పాడుపని.. తినే పాత్రలపై పనిమనిషి ఏం చేస్తుందో చూడండి!

Watch Video: ఛీ.. ఛీ ఇదేం పాడుపని.. తినే పాత్రలపై పనిమనిషి ఏం చేస్తుందో చూడండి!


ఒక ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ.. వంట పాత్రలను శుభ్రం చేసే క్రమంలో వాటిపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, పాత్రలు కడుగుతున్నప్పుడు మహిళ వాటిపై మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన సత్యం అనే వ్యక్తి ఇంట్లో పనిచేసే మహిళకు సంబంధించిన ఈ వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గలీజ్‌ పనికి పాల్పడిన మహిళ ఆ ఇంట్లో గత పదేళ్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆమెను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసిన ఆ ఇంటి వ్యక్తులకు.. ఒకరోజు సీసీటీవీలో దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. వంటపాత్రలపై తమ ఇంట్లో పనిచేస్తున్న మహిళ మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకు ఆమె ఎందుకు అలా చేస్తుందో వారికి అర్థం కాలేదు. ఇక వెంటనే షాక్‌లోంచి తేరుకున్న కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదురు పనిమనిషిపై ఫిర్యాదు చేశారు.

ఇంటియజమాని ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనిచేస్తున్న మహిళను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అయితే ఆ మహిళ పాత్రలపై మూత్ర విజర్జన ఎందుకు చేసింది అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంట్లో పనిమనిషిని పెట్టుకోవాలంటేనే భయపడుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *