ఈ మధ్య కాలంలో ప్రయాణికులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడులకు పాల్పడుతున్నారు. విధుల్లో ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి దాడులకు పాల్పడికే ఉపేక్షిచేంది లేదని ఇప్పటికే చాలా సార్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయాణికుల్లో మాత్రం మార్పు రావడం లేదు.. రోజు ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న విషయాలకే ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో మరోసారి వెలుగు చూసింది. మహిళా బస్సు కండక్టర్‌పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. అయితే బస్సు ఎక్కిన ఒక ప్రయాణికులురాలు బస్సు స్టాప్‌లో కాకుండా తనకు అనుకూలమైన ప్రాంతంలో బస్సులు ఆపమని కండెక్టర్‌కు చెప్పగా.. బస్సును ఎక్కడపడితే అక్కడ ఆపడం కుదరదని సదరు కండక్టర్, డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన సదురు మహిళా ప్రయాణికురాలు.. కండక్టర్‌పై అరవడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అది కాస్తా చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది.
దీంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపేశాడు. అయినా కూడా వాళ్ల మధ్య గొడవ తగ్గలేదు.. బస్సులోంచి దిగన తర్వాత కూడా సదురు మహిళా ప్రయాణికురాలు.. కండక్టర్ గొంతు పట్టుకొని కొడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే ఈ తంతంగాన్నంత అక్కడే ఒక ప్రయాణికులు తన ఫోన్ రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.