మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా బాలీవుడ్ హిట్ పాట పెహ్లా నాషాను పియానోతో వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్ భవన్‌లో 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్ క్లాసిక్ పాట పెహ్లా నాషాను ప్రదర్శించడం ద్వారా గవర్నర్ సిహెచ్ విజయశంకర్‌తో సహా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సిఎం సంగ్మా 1992 చిత్రం జో జీతా వోహి సికందర్‌లోని పాటను ప్లే చేశారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపించారు.
సీఎం సంగ్మా తన సంగీత ప్రతిభతో వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. సంగీతం పట్ల తనకున్న ప్రేమకు పేరుగాంచిన ముఖ్యమంత్రి గతంలో కూడా తన గిటార్ వాయించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
2023లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ముఖ్యమంత్రి మెటల్ బ్యాండ్ ఐరన్ మైడెన్ ‘వేస్టెడ్ ఇయర్స్’ నుండి ఐకానిక్ గిటార్ సోలోను అప్రయత్నంగా ప్లే చేస్తున్నట్లు చూపించారు. 2021లో ముఖ్యమంత్రి బ్రయాన్ ఆడమ్స్ ఎవర్‌గ్రీన్ పాట ‘సమ్మర్ ఆఫ్ 69’ను పాడుతున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..