Watch: లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Watch: లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు


ఏ పనిలో అయినా నిబద్ధతగా పనిచేస్తే సముచిత గౌరవం దక్కుతుందని,  పనిలో నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. అలా పని చేశాను కాబట్టే పార్టీలో ఎంతోమంది అర్హులు ఉన్న తాను అనుకోని పదవి తనకు వచ్చిందని ఆయన అన్నారు. ఒక లారీ డ్రైవర్ కొడుకుగా ఉన్న తాను ఈరోజు మంత్రిని అవుతారని ఏనాడు అనుకోలేదన్నారు. తన నిబద్ధత, చిత్తశుద్ధి ఈ స్థాయికి తీసుకు వచ్చిందని మంత్రి సత్య కుమార్ తెలిపారు

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. తన పుట్టిన ఊరుకు మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా వచ్చిన సత్య కుమార్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం బిజెపి పార్టీలోని ఏబీవీపీలో చేరి అక్కడ నుంచి ఇప్పటివరకు పార్టీలో ప్రతి పనిని చిత్తశుద్ధితో నిబద్ధతతో చేశానన్నారు. అందుకే తనకు ఇంత హోదా లభించిందని ఆయన గర్వంగా చెప్పారు. పార్టీ చెప్పిన ప్రతి పనిని చిత్తశుద్ధితో చేశానని దేశంలో ఎక్కడకు పంపించి పని చేయమన్నా.. తనకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు. పార్టీ ఎదగడానికి కృషి చేశానని పార్టీలో కష్టపడే వ్యక్తులకు ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందని సత్య కుమార్ అన్నారు.

తన కన్నా పార్టీలో ఎంతోమంది అర్హులు ఉండి కూడా మంత్రి పదవి తనను వరించిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు బిజెపి అండగా ఉంటుందని ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవించి బిజెపిలో అత్యున్నత స్థానాలను పొందారని ఆయన తెలిపారు. దానికి ఉదాహరణగా టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారని, ఒక టీచర్ కొడుకు వాజ్‌పేయి కూడా ప్రధానిగా అయ్యారని గుర్తుచేశారు. అలా బిజెపిలో అనేకమంది కష్టపడిన వ్యక్తులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన తెలిపారు. తాను కూడా ఇదే ప్రొద్దుటూరులో ఒక లారీ డ్రైవర్ కొడుకుగా ఉండి ఈరోజు మంత్రిని అవుతానని ఏ రోజు కలలో కూడా అనుకోలేదన్నారు. కానీ ఆ పదవి తనను వరించిందని సత్య కుమార్ చెప్పారు కష్టపడే ప్రతి కార్యకర్తకు బిజెపి లో స్థానం ఉందని ఆ స్థానాన్ని పదులపరుచుకోవాలంటే నిబద్ధత కలిగి ఉండాలని ఆయన అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *