ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలతో వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో 1500 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. భారీ వరదలకు రహదారులపై కొండ చరియలు విరిగిపడటంతో ప్రయాణాలు నిలిచిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. లాచుంగ్ ప్రాంతంలో 1350 మంది, లాచెన్‌లో 115 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు సంబంధిత పేర్కొన్నారు. వర్షాలు తగ్గే వరకూ పర్యటకులు ఈ ప్రాంతాలకు రాకూడదని సూచించారు.
#WATCH | North Sikkim, Sikkim | Water level of the Teesta river increases following heavy rainfall in the region. pic.twitter.com/mWbcXzNgL8
ఇవి కూడా చదవండి
— ANI (@ANI) May 31, 2025
మరోవైపు, తప్పిపోయిన ఎనిమిది మంది పర్యాటకుల కోసం అధికార బృందం విస్తృత గాలింపు కొనసాగిస్తున్నారు. మరో వైపు గురువారం రాత్రి మంగన్ జిల్లాలోని తీస్తా నదిలో 11 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు. లాచెన్-లాచుంగ్ హైవే వెంబడి మున్సితాంగ్ సమీపంలో ఈ వాహనం 1,000 అడుగులకు పైగా నదిలోకి పడిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి..
అస్సాంలో భారీ వర్షాల వల్ల 17 జిల్లాలు ప్రభావితమయ్యాయి. లక్ష్మిపూర్ ఒక్క జిల్లాలోనే ఏకంగా 40 వేల మందికి పైగా వరద బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..