Viral Video: స్కూటీ షోరూమ్‌ నుంచి నేరుగా డ్రైవింగ్‌ టెస్టుకు వచ్చిందా ఏంది… ఈ వీడియోను చూస్తే మీకు కూడా నవ్వాగదు!

Viral Video: స్కూటీ షోరూమ్‌ నుంచి నేరుగా డ్రైవింగ్‌ టెస్టుకు వచ్చిందా ఏంది… ఈ వీడియోను చూస్తే మీకు కూడా నవ్వాగదు!


ఒక మహిళ డ్రైవింగ్ టెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్‌ నవ్వాపుకోలేకపోతున్నారు. ఓ మహిళ స్కూటీని తడబడుతూ నడుపుతున్న తీరు చూసి, నెటిజన్లు ఆమె షోరూమ్ నుండి నేరుగా వచ్చి ప్రాక్టీస్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చిందని జోక్ చేస్తున్నారు! ఏమైనా, మహిళల డ్రైవింగ్ నైపుణ్యాల గురించి ఇంటర్నెట్‌లో చాలా మీమ్స్ మరియు జోకులు ఉన్నాయి, కానీ ఈ వైరల్ వీడియో మాత్రం వాటన్నింటికీ బాప్‌లాంటి వీడియో. ఈ వీడియోలో ఆ మహిళ తన డ్రైవింగ్ ‘నైపుణ్యం’తో కొత్త చరిత్ర సృష్టించిందని కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్స్‌

వైరల్ వీడియోలో, ఒక మహిళ లైసెన్స్ పొందడానికి డ్రైవింగ్ పరీక్ష ఇస్తున్నట్లు చూడవచ్చు. కానీ ఆ మహిళ తన స్కూటీని నడుపుతున్న విధానాన్ని చూసి, అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు కూడా భయపడ్డారు! స్కూటీపై ఆ మహిళ నియంత్రణ ఎంతగా ఉందంటే, ఆమె ఎప్పుడైనా ఏ దిశలోనైనా వెళ్లగలదని అనిపిస్తుంది.

ఆ మహిళ స్కూటీని ఎలాగోలా కాలుతో ముందుకు నెట్టివేస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ ‘ప్రమాదకరమైన’ డ్రైవింగ్‌ను చూసి, అటుగా వెళుతున్న ఎర్రటి కారు కూడా ఆగి, ఆ మహిళ తన స్కూటీని నేరుగా ఢీకొట్టవచ్చని అక్కడే ఆగిపోయింది. ఆ మహిళ చేసిన డ్రైవింగ్‌ను తీరుతో ఖచ్చితంగా ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుందని అనిపిస్తుంది.

కామెంట్ సెక్షన్‌లో యూజర్లు ఒకదాని తర్వాత ఒకటి ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఆంటీ కాలినడకన వెళ్లి ఉంటే బాగుండేది అంటూ ఒకరు కామెంట్‌ పెట్టారు. ఆంటీ ఎప్పుడు కారును ఢీకొడుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను అని మరొక యూజర్ అన్నాడు. లైసెన్స్ పొందడానికి ఆమె షోరూమ్ నుండి నేరుగా వచ్చినట్లు అనిపిస్తుందని మరొక యూజర్ రాశాడు.

వీడియో చూడండి:





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *