ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల పాములు విషపూరితం కానివి. అయినప్పటికీ పాము ఎదురపడినప్పుడు వాటికి ఎలాంటి హాని కలిగించకుండా నెమ్మదిగా దాని నుండి దూరంగా వెళ్లటం ఉత్తమం. ప్రమాదవశాత్తు పాము కాటు వేస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వర్షాకాలంలో తరచూ పాములు ఇళ్లల్లోకి వస్తుంటాయి. అలా ఇంట్లో పాము కనిపిస్తే వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వరద నీటిలో కనిపించిన ఒక పాము ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
నవీ ముంబైలోని వరదలున్న రోడ్డుపై ఒక పెద్ద ఆకుపచ్చ పైథాన్ కనిపించింది. ఆ పాము ప్రశాంతంగా ఈత కొడుతున్న అరుదైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు భయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. @sarpmitr_ashtvinayak_more అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ క్లిప్ 6.7 మిలియన్లకు పైగా వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది.
ఇవి కూడా చదవండి
వైరల్ వీడియోలో వర్షం కారణంగా రోడ్లన్నీ వరదతో నిండిపోయాయి. రోడ్డు పై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది.. మొదట్లో అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ కెమెరా జూమ్ చేసినప్పుడు ఆ నీటిలో ఒక పాము తల కనిపించింది. వర్షపు నీటి పైన ప్రశాంతంగా తేలుతూ ఉన్న పాము తల కనిపిస్తుంది. స్థానికులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా, భయంగా, మరికొందరు హాస్యంగా చూస్తున్నారు. పామును చూసిన తర్వాత కొందరు భయపడుతుండగా, మరికొందరు ఈ వింత పరిస్థితిని చూసి షాక్ అయ్యారు.
వీడియో ఇక్కడ చూడండి…
అయితే, ఈ వీడియోకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే, కొందరు ఇలాంటి పాముల శ్రేయస్సు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం తర్వాత పాములు తరచుగా ఇలా జనావాసాల్లో కనిపిస్తుంటాయి. వరదల కారణంగా పాములు చెట్లు, పొదలు, పుట్టలు కొట్టుకుపోవడంతో ఇలా రోడ్లు, ఇళ్లలోకి వచ్చి చేరుతుంటాయని కొందరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..