
వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వివాహంలో డ్యాన్స్‌లు చేయడం, విన్యాసాలు చేయడం వంటి వీడియోలు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వివాహానికి సంబంధించిన వీడియోలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అక్కడ భూకంపం రాలేదు… షాక్ కూడా రాలేదు, కానీ పైకప్పు మీద నిలబడి ఉన్న బంధు మిత్రులు ఒక్కసారిగా కింద పడిపోయారు.
పెళ్లిలో ఇంత భయంకరమైన సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటి పైకప్పు మీద వివాహ వేడుక జరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వధూవరులు అందమైన మంటపంలో కూర్చుని పూర్తి ఆచారాలతో వివాహ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. పక్కన బంధు మిత్రులు నిల్చుని వివాహ తంతును తిలకిస్తున్నారు. ఇంతలో, మంటపానికి ఎడమ వైపున నిలబడి ఉన్న వ్యక్తులు పైకప్పు పడిపోవడంతో నేరుగా కిందకు పడిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత, అక్కడ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా గాయపడినట్లు కనిపిస్తున్నారు. కానీ అక్కడ ఎటువంటి పెద్ద ప్రమాదం కనిపించలేదు.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ స్పందిస్తున్నారు. పెళ్లి మంటపం మధ్యలో ఉందని, లేకపోతే వధూవరుల పరిస్థితి కూడా అలాగే ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram