చిన్న పామును చూస్తేనే మనం ఆమడ దూరం పరిగెత్తుతాం.. అలాంటిది అనకొండ కనిపిస్తే ఇంకేమైనా ఉందా మరోసారి ఆ చుట్టుపక్కకు కూడా వెళ్లం. కానీ ఇక్కడో వ్యక్తి అనకొండను చూసి భయపడకపోగా.. ఏకంగా దాని తోకను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అమెజాన్ అడవుల్లోని ఓ సరుసుల్లో చేపలు పట్టేందుకు తన చిన్న పడవను తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి ఒక పెద్ద అనకొండ కనిపించింది. అది తన పడవైపు దూసుకొచ్చింది. దాన్ని గమనించిన ఆ జాలర్ భయపడకుండా తన పడవైపుకు వచ్చిన అనకొండ తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దాని బలానికి జాలర్ పడవ అటు ఇటు ఊగిపోయింది.
Fisherman finds huge anaconda 🐍 pic.twitter.com/xiK4IZrqpK
— Terrifying Nature (@JustTerrifying) March 10, 2023
పడవ కిందపడిపోయే స్థితికి వచ్చినా జాలర్ మాత్రం ఆ అనకొండ తోకను వదిలిపెట్టలేదు. దీంతో అనకొండ అక్కడి నుంచి వెళ్లేందుకు తన శక్తమీర ప్రయత్నించింది. చివరకు అతనకు దాని తోకను వదిలేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.