వర్షాకాలం రాగానే వేడి వేడి పకోడీలు, సమోసాలు, టీ తాగాలని అందరికీ అనిపిస్తుంది. మన ఇండియాలో ఉల్లిపాయ, మిర్చి పకోడీలకు ఉన్న క్రేజే వేరు. కానీ మలేషియాలో మాత్రం ఈ స్ట్రీట్ ఫుడ్ కి ఒక క్రియేటివ్ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో చెప్పుల ఆకారంలో ఉన్న పకోడీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వీటిని అక్కడ కరిపాప్ లేదా కర్రీ పఫ్ అని పిలుస్తారు. చూడ్డానికి అచ్చం చెప్పుల్లాగే ఉన్నా.. తినడానికి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిలో మసాలా చికెన్, బీఫ్, మటన్, లేదా బంగాళాదుంపల స్టఫింగ్ నింపి పర్‌ఫెక్ట్ షేప్ ఇచ్చి వేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తారు. దీంతో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. కొన్ని చోట్ల దీనిపై నువ్వులు చల్లి రుచిని మరింత పెంచుతారు.
ఈ చప్పల్ పకోడీలు చేయడం కూడా ఒక ఆర్ట్ లాంటిదే. మసాలాలు బాగా పట్టించి.. రుచి అద్భుతంగా ఉండేలా చూసుకుంటారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఒక యూజర్ ఇది నిజంగా అద్భుతం.. మలేషియా స్ట్రీట్ ఫుడ్ అంటే మామూలుగా లేదు అని కామెంట్ చేశారు. ఈ కొత్త డిష్ మలేషియా వీధి ఆహారానికి ఒక కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచిందని చెప్పవచ్చు.