మనిషి ప్రేమించే గుణం, విశ్వాసంగల జంతువు అంటే కుక్క అని వెంటనే చెప్పేస్తారు. అయితే మనిషిని ప్రేమించే జంతువులో ఏనుగుకి కూడా ప్రధాన స్థానం ఉంది. వాస్తవానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి. తాజాగా ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. అవును ఒక గున్న ఏనుగుకి సంబంధించిన అందమైన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో గున్న ఏనుగు రోడ్డు పక్కన ఉన్న పండ్ల బండి నుంచి చిరుతిండిని తీసుకునే విధానం చూపరుల ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగించింది.
కొన్ని ఏనుగులు రోడ్డుమీద వెళ్తున్నాయి. ఒక భారీ ఏనుగు మీద మావటి కూర్చుకుని ఉన్నాడు. అయితే ఈ బృందంలో ప్రయాణిస్తున్న గున్న ఏనుగుకి రోడ్డు పక్కన చెరుకు ఉన్న బండి కనిపించింది. అపుడు ఇష్టంగా చెరుకు గడల కోసం ఆ బండి దగ్గరకు ఆత్రంగా వెళ్ళింది. అప్పుడు ఏమి జరిగిందంటే..
ఇవి కూడా చదవండి
మాజీ IFS అధికారి సుశాంత నందా తారు రోడ్డు వెంట ఏనుగుల గుంపు వెళుతున్న వీడియోను అప్‌లోడ్ చేశారు. అయితే ఆ వీడియోలో గున్న ఏనుగు.. తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. చెరకు బండి దగ్గరకు వెళ్ళినా సరే చెరకు తీసుకోకుండా అమ్ముతున్న స్త్రీ .. ఆ చెరకు గెడను తన చేతులతో స్వయంగా ఇచ్చే వరకూ (ఓపికగా) వేచి ఉంది. దీంతో గున్న ఏనుగు తీసుకునే శక్తి ఉన్నా సరే.. అది తన చోటులో నిలబడి గౌరవప్రదంగా చేరకుని తీసుకున్న తీరుకు ముగ్ధులయ్యారు. ఈ వీడియోపై ఒకరు వ్యాఖ్యానిస్తూ తనకు తీసుకునే వీలున్నా.. అది తీసుకోకుండా మహిళ ఇచ్చే వరకూ చాలా ఓపికగా వేచి ఉంది. అది చిన్నప్పటి నుంచి వచ్చే ప్రవర్తన ఆధారంగా ఉంటుంది.
A quick snacks break for Chotu. Cute💕 pic.twitter.com/euuOjJkzN8
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) June 23, 2025
ఏనుగులు పట్టణ వాతావరణంలో ఉండటం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. చాలా మంది గున్న ఏనుగు ముద్దుగా ఉండటం ఇష్టపడ్డారు. “ఈ గున్న ఏనుగులకు ఏదైనా ఆహారం, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉచితంగా అందుబాటులో ఉంచాలి” అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ క్లిప్ చాలా మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. చోటు ముద్దుగా ఉంది.. ప్రతి హృదయాలను దోచుకుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు ఈ “చోటు చాలా ముద్దుగా ఉంది అని తన ప్రేమని తెలియజేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..