సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది, అందులో ఒక చిన్న కాకి ధైర్యం ముందు క్రూర జంతువు తోక ముడిచింది. కాకి ముందు మచ్చలు గల చిరుత పులి మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యం నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. నెటిజన్లు ఇప్పుడు కాకి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. వైరల్ వీడియోలో పెంపుడు కుక్కను కట్టివేసినట్లుగా ఇంటి వెలుపల ఒక పట్టీకి కట్టి కూర్చున్న పెంపుడు చిరుత పులిని చూడవచ్చు. అదే సమయంలో సమీపంలో ఒక కాకి కూడా ఉంది. అది చిరుతపులితో గొడవ చేయడానికి ధైర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ దృశ్యాన్ని చూసినప్పుడు చిరుత పులి ఆ కాకిని ఒక్క పంజా దెబ్బతో ఖతం చేస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ వీడియోలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వీడియోలో చిరుతపులి దగ్గరకి కాకి వస్తుంది. ఆపై దాని బిగ్గరగా ‘కావ్-కావ్’ అంటూ అరస్తూ దానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మాంసాహారి అయిన చిరుత లేచి కాకిని దాడి చేయడానికి బదులుగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.
కాకి నిరంతరం అరుస్తూ ఉండటం.. ఎలాంటి భయం లేకుండా తన దగ్గరికి వస్తున్న తీరును చూసి ఎందుకైనా మంచిదని చిరుతనే వెనక్కి తగ్గుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు మరియు కాకి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. చిరుత అహంకారాన్ని కాకి బద్దలు కొట్టిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.