Viral Video: ఏకంగా పాముతోనే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌బాబు ఫ్యాన్‌… అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలానా?

Viral Video: ఏకంగా పాముతోనే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌బాబు ఫ్యాన్‌… అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలానా?


ఫ్యాన్స్‌ పిచ్చి పీక్‌ స్టేజ్‌కి చేరడం అంటే ఇదే మరి. సినిమాలో హీరోలను ఫ్యాన్స్‌ అనుకరించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. హీరోల మాదిరిగా డ్యాన్స్‌ చేయడం, యాక్టింక్‌ చేయడం, డైలాగ్స్‌ చెప్పడం, హీరోలు ధరించిన డ్రెస్‌ ధరించడం వంటివి చేస్తుంటారు. మరికొంత మంది ఫ్యాన్స్‌ మాత్రం హీరోల మీద అభిమానంతో రకరకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అయిన రోజు మాత్రం ఫ్యాన్స్‌కు పండగే. థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇక సినిమాలో హీరో ఎంట్రీ సమయంలో ప్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తుంటారు. విజిల్స్‌ వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు.

ఇక ఈ మధ్యకాలంలో పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన హీరోల మూవీలను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం కల్పించేందుకు రీరిలీజ్‌ చేస్తున్నారు. దీంతో తమ అభిమాన హీరో హిట్ సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఫ్యాన్స్‌ పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీని రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని చేసిన అత్యుత్సాహం వైరల్‌గా మారింది. ఖలేజా సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్‌ను అనుకరించి తోటి అభిమానుల గుండె ఆగినంత పని చేశాడు. మహేష్ అభిమాని ఓవరాక్షన్‌తో కొంత సమయం పాటు ఫ్యాన్స్ హడలిపోయారు.

విజయవాడ‌లోని ఓ థియేటర్‌లో ఖలేజా మూవీని రీరిలీజ్ చేశారు. ఖలేజా మూవీలో మహేష్ ఎంట్రీ సీన్‌లో పాముతో నడిచొచ్చే సీన్‌ వీర లేవల్లో ఉంటుంది. ఓ అభిమాని మహేష్ ఎంట్రీ సీన్‌ను యదావిధిగా అనుకరించాడు. ఏకంగా నిజమైన పాము పిల్లతో థియేటర్లోకి అడుగుపెట్టాడు. మొదట అది రబ్బర్ పాము అని లైట్‌ తీసుకున్న ఫ్యాన్స్.. నిజమైన పాము అని తెలియడంతో పరుగులు పెట్టారు. థియేటర్ యజమానికి తెలియడంతో సదరు అభిమానిని బయటకు పంపించేశారు. ఈ ఘటనతో కాసేపు థియేటర్‌లో గందరగోళం నెలకొంది. అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతలానా అంటూ కొందరు ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు.

వీడియో చూడండి:





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *