ఎద్దులు, గేదెలు వంటి మూగజీవాలు ఎంత శాంతంగా ఉంటాయో.. వాటికి చిర్రెత్తుకొస్తే మాత్రం అంతకు మించి వాయిలెంట్‌గా మారతాయి. ఒక్కసారిగా ఎదురు తిరిగాయంటే ఎవ్వరి మాట వినని సీతయ్యలా స్వైర విహారం చేస్తుంటాయి. ముఖ్యంగా రెండు ఎద్దులు ఎదురు పడ్డప్పుడు జరిగే సీన్ ఎలా ఉంటుందో మనలో చాలా మంది చూసే ఉంటారు. కాలు కింద రాస్తూ.. కొమ్ములు విదిలిస్తూ నీ పతాపమో, నా పతాపమో చూసుకుందా రా అన్నట్లు గాండ్రిస్తుంటాయి. అంతే కాదు ఒక్కసారి ఫైటింగ్‌కు దిగాయంటే చుట్టు ఏమున్నాయో కూడా పట్టించుకోవు. అంతా విధ్వంసమే. ఆపడానికి పోయిన వారిని కూడా కుమ్మేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కుమ్మేసింది మనిషినయితే కాదు. ఓట్రాక్టర్‌ను అమాంతం ఎత్తిపడేసింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ఎద్దు రోడ్డుపై ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లడం చూడొచ్చు. ఆ సమయంలో దానికి ఒక ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్ తొలుత ఆ ఎద్దును చూడగానే అనుమానం వచ్చి ట్రాక్టర్‌ను ఆపేశాడు. అయితే ఆ ఎద్దుకు ఏమనిపించిందో ఏమోగాని, ట్రాక్టర్ ముందు నిలబడి పూర్తిగా ట్రాక్టర్ ఇంజిన్‌ను కొమ్ములతో ఎత్తి పడేసింది. ఎద్దు బలం దెబ్బకు ఫుల్ లోడ్‌తో ఉన్న ఆ ట్రాక్టర్ వెనక్కు జరిగిపోయింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి భయంతో దిగి కిందకు దిగిపోయాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి:
నెటిజన్స్ ఆ వీడియోపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని మించి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎద్దుకు ఎంత బలం ఉంటుందో చూశారా అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.