
రైతులకు పాడిపశువుల పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పశువులను చూసుకుంటూ ఉంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటిలో పుట్టిన ఆవు దూడకు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపాడు రైతు. బంధు మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి, కేక్ కట్ చేసి అవు దూడకు ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఔరయ్య జిల్లాలోని భార్సేన్ గ్రామానికి చెందిన రామ్ శంకర్ పాల్ ఇంటిలో అవుదూడ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం, రామ్ శంకర్ పాల్ ఒక చేత్తో ఆవుదూడ ముఖాన్ని పట్టుకుని, అదే చేత్తో కత్తిని దాని ముఖం దగ్గర పట్టుకుని కేక్‌ను కత్తిరించడం చూడవచ్చు. అనంతరం అతను ఆవు దూడకు ప్రేమగా కేక్ ముక్కను అందించాడు. దూడను కూడా తమ కుటుంబ సభ్యునిగా భావించాడు. అతని బంధువులు, ఇరుగుపొరుగువారు చప్పట్లు కొట్టి, ఉత్సాహపరిచారు.
వీడియో చూడండి:
#औरैया :
किसान ने गाय के बच्चे का 1 साल पूरा होने पर केक काटकर मनाया जन्मदिन
मामला भरसेन गांव का, किसान राम शंकर पाल ने परिवार सहित किया जश्न
गाय के साथ केक काटने का वीडियो सोशल मीडिया पर वायरल#Auraiya #ViralVideo #CowBirthday #UPNews #BreakingNews pic.twitter.com/qlTZjtAwLV
— News1India (@News1IndiaTweet) August 20, 2025
ఆవుదూడ పుట్టినరోజు రైతు ఇంట్లో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. పిల్లలు మరియు పెద్దలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పవిత్రంగా భావించే పశువుల పట్ల రైతుకు ఉన్న ప్రేమను ఈ సంఘటన ప్రతిబింబిస్తుందని వైరల్ వీడియో చూపించింది.
సోషల్ మీడియా వినియోగదారులు రైతు తన జంతువుల పట్ల ప్రేమను ప్రశంసించారు మరియు క్లిప్‌ను విస్తృతంగా షేర్ చేశారు.