నాగ్‌పూర్‌లో ఓ ఇంట్లో దిండులో విషసర్పం దాగి ఉండటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి వేళ బెడ్ రూంలో దిండులో సుమారు ఒక అడుగు పొడవున్న నాగుపాము కనిపించడంతో ఆ ఫ్యామిలీ కంగుతింది. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. విష సర్పం మొదట దిండు కింద కనిపించింది. తర్వాత మంచం కిందికి వెళ్లి దాగింది. స్నేక్ క్యాచర్ ఆ పామును జాగ్రత్తగా పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి.. ఆపై అటవీ ప్రాంతంలో వదిలేశాడని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వేలాది మంది చూశారు. వీడియోలో సర్పం దిండులోని కోనలో దాక్కుని ఉండడం చూడవచ్చు. వామ్మో మరీ బెడ్ రూంలోకి వచ్చేస్తే మేం ఎలా బతకాలి మావ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీడియో దిగువన చూడండి..
#WATCH | Viral Video Shows Poisonous Snake Under Pillow In Nagpur#Maharashtra #nagpur #snake #maharashtranews pic.twitter.com/cMVHDdtjTM
— Free Press Journal (@fpjindia) May 30, 2025