పై ఫొటోలోనిఅక్కాతమ్ముళ్లను గుర్తు పట్టారా? ఇప్పుడు వీరు బాగా ఫేమస్. అలాగనీ వీరేమీ స్టార్ హీరోయినో, స్టార్ క్రికెటరో కాదు. కానీ అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్‌నే సొంతం చేసుకున్నారీ బ్రదర్ అండ్ సిస్టర్. సందర్భమేదైనా, ఈవెంట్ ఏదైనా వీరు బయట కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ అటు వైపే ఉంటాయి.
అంతలా పాపులారిటీని సొంతం చేసుకున్నారీ అక్కా తమ్ముళ్లు మరెవరో కాదు సచిన్ టెండూల్కర్ కూతురు, కుమారుడు సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్.
కాగా ఇటీవలే అర్జున్ టెండుల్కర్ పుట్టినరోజు జరుపుకొన్నాడు. 25వ పడిలో అడుగుపెట్టిన అతనికి కుటుంబ సభ్యుల నుంచి విషెస్ వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా అర్జున్ అక్క సారా టెండల్కర్ అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పింది
మా ఇంట్లో అందరికంటే చిన్నవాడికి 25వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రపంచం నువ్వే. లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా’’ అని అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది సారా.
ప్రస్తుతం ఈ అక్కాతమ్ముళ్ల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సారా మోడల్‌గా అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు