Viral: వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి హడల్

Viral: వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి హడల్


మాములుగా చిన్న పామును చూస్తేనే దడుచుకుని పరుగులు తీస్తారు. అలాంటిది భారీ కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. అది కూడా మహిళలకు కనిపిస్తే.. పాపం వారి పరిస్థితి ఊహించుకుంటేనే భయానకం కదా..? కానీ కేరళలో ఓ ఇంటి మహిళలు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. కన్నూరు జిల్లా వాణియప్పంలో ఒక ఇంటి వంటగదిలో మూలన కనిపించిన కింగ్ కోబ్రాను చూసి కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. వంటగది మూలన చుట్టుకుని కదలకుండా ఉన్న ఆ భారీ పామును చూసి భయపడిన వారు వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చారు.

కాల్ వచ్చిన వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. ఫైసల్‌ విలక్కోడ్‌, మిరాజ్‌ పేరావూర్‌, అజిల్‌కుమార్‌, సాజిద్‌, ఆరణం లాంటి నిపుణులు అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును పట్టుకున్నారు. తర్వాత దానిని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. వారం రోజుల వ్యవధిలో కన్నూరులో కింగ్ కోబ్రాలు హల్ చల్ చేయడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం తుడిమర టౌన్‌ సమీపంలోని ఒక భవనంలో దొరికిన భారీ పామును కూడా ఇదే బృందం పట్టుకుని అడవిలో వదిలింది.

ఇక రెండు రోజుల క్రితం వడక్కంచేరి పూతనక్కయం ప్రాంతంలోనూ ఓ కింగ్‌ కొబ్రాను రెస్క్యూ చేశారు. ఓ వ్యక్తి స్థలానికి ఆనుకుని ఉన్న వాగులో కార్మికులు పనిలో ఉన్నప్పుడు పామును గమనించి, వెంటనే అటవీశాఖవారికి సమాచారం ఇచ్చారు. అధికారులు చేరుకుని పామును పట్టుకుని అడవిలో వదిలారు.

మరిన్ని వైరల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *