తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని లియాన్యుంగాంగ్లో ఓ వైద్యుడు.. ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి ఛాతీ ఎక్స్‌రే చూసి కంగుతిన్నాడు. ఆ చిన్నారి జీర్ణవ్యవస్థ పైభాగంలో ఒక నాణెం ఉన్నట్లు గుర్తించారు. ఆ నాణెం అప్పటికే నల్లగా మారిపోయిందని.. అది శరీరంలో నెల రోజులకు పైగా ఉన్నట్టు డాక్టర్లు తేల్చారు.
న్యుమోనియా చికిత్స నిమిత్తం ఆ చిన్నారి మొదటిగా ఆస్పత్రిలో చేరిందట. వికారం, వాంతులు, పరోక్సిస్మల్ ఏడుపు వంటి లక్షణాలను ఆ చిన్నారిలో తల్లిదండ్రులు ఏం గుర్తించలేదని డాక్టర్లు చెప్పారు. చిన్నారిది చిన్న వయస్సు కావడం అలాగే.. గ్యాస్ట్రిక్ కుహరంలో విదేశీ వస్తువు ఉండటం వల్ల సహజంగానే అది బయటకు వెళ్లే అవకాశం లేదని డాక్టర్ గుర్తించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. దాన్ని త్వరతగిన శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని డాక్టర్లు భావించారు.
అయితే మొదటిగా జీర్ణశయాంతర ఎండోస్కోపీ నిర్వహించేందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని డాక్టర్లు అన్నారు. కానీ సెకండ్ విజిట్‌లో చిన్నారికి ఆపరేషన్ నిర్వహించారు. ఆ చిన్నారి వయస్సును దృష్టిలో పెట్టుకుని చాలా టెక్నికల్‌గా ఆ నాణాన్ని కేవలం 10 నిమిషాల్లోనే బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..