Vinayaka Chavithi: ఏపీలో గణపతి మండపాలకు అనుమతి ఈజీ.. స్పెషల్ వెబ్‌సైట్‌ రెడీ.. ఎలా అప్లై చేయాలంటే..

Vinayaka Chavithi: ఏపీలో గణపతి మండపాలకు అనుమతి ఈజీ.. స్పెషల్ వెబ్‌సైట్‌ రెడీ.. ఎలా అప్లై చేయాలంటే..


వినాయక చవితి పండగ అంటే ఆబాలగోపాలం కోలాహాలంగా జరుపుకోవడానికి రెడీ అవుతారు. ఇప్పటికే ఈ పండగ సందడి మొదలైంది. గల్లీ గల్లీ లో గణపతి మండపాలు వెలుస్తాయి. చవితికి వారం రోజులున్నా బొజ్జ గణపయ్య భక్తుల హడావిడి మొదలైంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాలకు పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మండపాల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి మండపాల అనుమతులపై ఎటువంటి వివాదాలు లేకుండా.. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. ఉండేలా ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండపాలకు అనుమతులు ఇచ్చే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది.

గణపతి నవరాత్రి ఉత్సవాల అనుమతుల కోసం ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను పోలీసులు తయారు చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేసి అనుమతి తీసుకోవచ్చు. ఈ అనుమతుల కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. సంబంధిత పోలీస్ అధికారి ముందుగా మండపం ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలిస్తారు. అక్కడ నిబంధనల ప్రకారం ఉన్నట్లు గుర్తిస్తే.. వెంటనే
QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. ఈ విధానం వలన ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేలా చూడవచ్చు అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మండపాల కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే

  1. వినాయక మండపం పెట్టాలనుకుంటున్న వారు అధికారిక వెబ్‌సైట్‌ ganeshutsav.net లోకి వెళ్లాలి.
  2. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై హియర్‌ అన్న చోట క్లిక్ చేయాలి. తర్వాత నిర్వాహకుల ఫోన్ నెంబర్ అడుగుతుంది.
  3. వినాయక మండప నిర్వహణ చేసే వ్యక్తుల ఫోన్‌ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ కి OTP వస్తుంది.
  4. ఈ ఓటీపీని 30 సెకన్స్‌లో లోపు ఎంటర్ చేయాలి. అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన విధంగా మీ వివరాలను అందించాలి.
  5. పూర్తి వివరాలు ఇచ్చి తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

అప్లికేషన్ నింపడానికి కావాల్సిన వివరాలు ఏమిటంటే..

  1. అప్లికేషన్ ఎవరి పేరు మీద ఇస్తున్నారో వాళ్ల పేరు ..ఈమెయిల్ ఐడీ, అడ్రెస్‌, సంఘం పేరు వంటి పూర్తి, డీటైల్ ఇవ్వాల్సి ఉంటుంది..
  2. వినాయక విగ్రహం ప్రతిష్టించే ప్రాంతం వివరాలు.. అంటే అపార్టమెంట్‌లో, గుడిలో, కమ్యూనిటీ హాల్, బహిరంగ ప్రదేశం వంటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
  3. వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, కాలనీ పేరు ఏ కమిషనరేట్ పరిధిలోకి లేదా జిల్లా పరిధిలోకి వస్తుందో కూడా చెప్పాలి.
  4. మండపం సిటీ పరిధి, సబ్‌డివిజన్ కిందకు వస్తుందో తెలియజేయాలి.. ఏ పోలీస్‌ స్టేషన్ పరిధిలోకి వస్తుందో స్పష్టంగా తెలియజేయాలి.
  5. వినాయక విగ్రహం ఎత్తు, విగ్రహం ప్రతిష్టించే మండపం ఎత్తు ని కూడా ఇవ్వాలి.
  6. వినాయక ఉత్సవాల కమిటీలోని ఐదుగురు సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్‌లను.. వినాయక విగ్రహాన్ని ఎప్పుడు, ఎక్కడ నిమజ్జనం చేస్తారో.. తేదీ, సమయం సహా వివరాలను అందించాలి.
  7. వినాయక నిమజ్జనం అక్కడే చేస్తారా.. లేదా వాహనం ద్వార తరలించి నిమజ్జనం చేస్తారా పేర్కొనాలి.

ఈ వివరాలను పూర్తీ చేసి సబ్మిట్ చేస్తే.. ఆ వివరాల ఆధారంగా సమీపంలోని పోలీస్ అధికారి ఆ ప్రాంతానికి తనిఖీని వస్తారు. ఫారంలో ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయని భావిస్తే.. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి అనుమతి పత్రాన్ని పంపిస్తారు. సో ఈ ఏడాది మండప ఏర్పాటు కోసం అనుమతి కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ,, పోలీసుల చుట్టూ భక్తులు తిరగాల్సిన పని లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *