తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. కల్కి, లక్కీ భాస్కర్, రజాకార్ చిత్రాలకు పురస్కారాల పంట పండింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , పుష్ప2కి అవార్డు దక్కింది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను ఇవ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది. విభజనకు కొన్నేళ్ల ముందు నుంచి సినిమా పురస్కారాలు పెండింగ్‌లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ, జ్యూరీ సభ్యులు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. అవార్డుల విజేతలకు అభినందనలు తెలియ జేశారు. అలాగే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడం గౌరవంగా ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందకు కృతజ్ఞతలు, పెళ్లి చూపులు చిత్రానికి నా హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే ఈ గౌరవం, ఆనందం నా అభిమానులదే, వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉందని, నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్ కు ధన్యవాదాలు అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
#GaddarTelanganaFilmAwards ❤️🙏 pic.twitter.com/c435azxzHo
— Vijay Deverakonda (@TheDeverakonda) May 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.