ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ గా నిలిచినా విజయ్ దేవరకొండ అభిమానులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అంతకు మించి విజయ్ ఫ్యాన్స్ ఇంకేదో కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విజయ్ కూడా కింగ డమ్ పేరుతో ఓ డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ డమ్ సినిమా జులై 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ టీజర్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాకు సంగీతం అందిస్తోన్న అనిరుధ్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించిన వీడియోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి
ఈ వీడియోలో విజయ్ తన రౌడీ బ్రాండ్ టీ షర్ట్ తో పాటు షటిల్ బ్యాట్‌ను అనిరుధ్‌కు అందజేశారు. అలాగే చాలా సేపు ఇద్దరు కలిసి కింగ్ డమ్ సినిమా, సంగీతం, పాటల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ తర్వాత విజయ్ బహూకరించిన టీ షర్ట్ వేసుకుని అనిరుధ్ వచ్చాడు. ఆ తర్వాత అందరూ కలిసి షటిల్ ఆడటానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ గిఫ్ట్ ఇచ్చిన టీ షర్ట్ లో అనిరుధ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనున్నాడు.
సింగర్ అనిరుధ్ తో విజయ్ దేవరకొండ.. వీడియో
#Kingdom Boys – Ep 01
Boys meet.
Boys hug.
Boys laugh.
Boys exchange gifts.
Boys head out to play game.Worldwide Grand Release on July 4th. @TheDeverakonda @anirudhofficial @gowtam19 #BhagyashriBorse @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/wfbLzQBARH
— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి