క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో, 4వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతి తగలరాని చోట బలంగా తాకడంతో స్టోక్స్ నొప్పితో విలవిల్లాడిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ ఘటన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అనుకున్నంత ఎత్తుకు లేవకుండా, లో బౌన్స్‌గా దూసుకొచ్చి బెన్ స్టోక్స్ ప్రైవేట్ పార్ట్‌కు బలంగా తగిలింది. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి ధాటికి స్టోక్స్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.
ఇవి కూడా చదవండి
నొప్పిని భరించలేక స్టోక్స్ నేలపై పడుకొని విలవిల్లాడు. ఈ దృశ్యం చూసి మైదానంలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా వెంటనే స్టోక్స్ వద్దకు వెళ్లి పరామర్శించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా వెంటనే స్టోక్స్ దగ్గరికి వచ్చి ఏదైనా అయిందా అని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న స్టోక్స్, కొంతసేపటి తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు స్టోక్స్ పడ్డ బాధకు సానుభూతి వ్యక్తం చేస్తూ, “పాపం స్టోక్స్”, “బాక్స్ బద్దలైంది” అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, సిరాజ్ వేగం, బౌలింగ్ కచ్చితత్వం మరోసారి ఈ సంఘటనతో నిరూపితమయ్యాయి.
అద్భుతమైన బెన్ స్టోక్స్..
Thoughts and prayers for Ben Stokes 😅😅😅 pic.twitter.com/2RiAGkOKLF
— England Cricket (@englandcricket) July 25, 2025
బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీని ఆధారంగా ఇంగ్లాండ్ భారత్‌ను 358 పరుగులకే పరిమితం చేసింది. టెస్ట్‌లలో 5 వికెట్లు పడగొట్టిన ఘనతను స్టోక్స్ ఐదవసారి సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఐదుసార్లు 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 10 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే నాల్గవ ఆల్ రౌండర్ అతను. 8 సంవత్సరాల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనతను సాధించాడు. అతను చివరిసారిగా 2017 సంవత్సరంలో ఈ ఘనతను సాధించాడు.
జో రూట్ సెంచరీ..
బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జో రూట్ మాంచెస్టర్ టెస్ట్‌లో సెంచరీ సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్ట్‌లలో తన 38వ సెంచరీని సాధించాడు. ఈ సిరీస్‌లో రూట్ తన రెండవ సెంచరీని సాధించాడు. ఒక దేశంలో భారతదేశంపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా రూట్ సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో భారతదేశంపై అతను 1900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..