Video: మహిళకు బాడీ స్కాన్ చేయగా.. ప్రైవేటు పార్టు దగ్గర ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటని పరిశీలించగా

Video: మహిళకు బాడీ స్కాన్ చేయగా.. ప్రైవేటు పార్టు దగ్గర ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటని పరిశీలించగా


కాదేది కవితకు కానర్హం అన్నట్టుగా.. దొరికినవి దొరికినట్టుగా అక్రమ రవాణా చేస్తున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ కొన్ని వస్తువులను.. ఇంకా చెప్పాలంటే.! జీవం ఉన్న జంతువులను అక్రమంగా రవాణా చేసింది. అది కూడా ఎలా చేసిందో తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఓ ఫెర్రీ పోర్టులో అంతరించిపోతున్న నాలుగు పాములను ఓ మహిళ తన బ్రాలో దాచి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడింది. IUCN రెడ్ లిస్టులో ఈ బాల్ పైథాన్‌లు(Python regius)అత్యంత ప్రమాదకరమని తేల్చారు. చైనాలో వీటిని రక్షిత జాతిగా పరిగనిస్తారు. వీటిని అక్కడ పెంపుడు జంతువుగా ఉంచుకోవడం చట్టవిరుద్ధం.

చైనా, హాంగ్‌కాంగ్ సరిహద్దులలో ఉన్న ఫుటియన్ పోర్టు వద్ద ఈ అనుమానిత మహిళను పాములతో పట్టుకున్నారు అధికారులు. భద్రతా తనిఖీలు త్వరత్వరగా పూర్తి చేస్తున్న సమయంలో.. సదరు మహిళ కంగారుగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను లోతుగా చెక్ చేశారు. ఆమెకు బాడీ స్కాన్ చేయగా.. డిటెక్టర్‌లో ఆమె బ్రాలో సాక్స్‌లో చుట్టబడిన నాలుగు కొండచిలువలు కనిపించాయి. దీంతో దెబ్బకు ఆశ్చర్యపోయారు అధికారులు. ఇక ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ‘కొంత డబ్బుల కోసం.. ఎవరో చెప్పిన పనికి తాను ఈ సరీసృపాలను తీసుకొచ్చానని’ స్పష్టం చేసింది.

అధికారులు ఆ పాములను బాల్ పైథాన్‌లుగా గుర్తించారు. ఇవి అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల చివరివారంలోనూ అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మహిళ ఆమె బ్రాలో రెండు తాబేళ్లను దాచిపెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ దొరికింది. అంతేకాదు వాటిల్లో ఒకటి చనిపోయినట్టుగా ఆ సమయంలో అధికారులు గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *