Junior Davis Cup: క్రీడలలో స్పోర్టివ్‌నెస్ (క్రీడాస్ఫూర్తి) అత్యంత ముఖ్యం. కానీ, కొన్నిసార్లు ఆటగాళ్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జూనియర్ డేవిస్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాడు, భారత ఆటగాడి పట్ల ప్రదర్శించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. కజకిస్థాన్‌లో జరిగిన ఈ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆటగాడి ప్రస్టేషన్ కనిపించింది. సూపర్ టై-బ్రేక్ సింగిల్స్ మ్యాచ్‌లలో భాగంగా భారత ఆటగాళ్లు ప్రకాశ్ శరణ్, తన్విష్ పహ్వాలు ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో పాక్ ఆటగాడు దురుసు ప్రవర్తనతో క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
మే 24న కజకిస్థాన్‌లోని షైమ్‌కెంట్‌లో జరిగిన జూనియర్ డేవిస్ కప్ ఆసియా-ఓషియానియా టోర్నమెంట్‌లో ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు ప్రకాష్ సర్రన్, తావిష్ పహ్వా తమ సింగిల్స్ మ్యాచ్‌లలో అద్భుత ప్రతిభ కనబరిచి జట్టుకు విజయాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి
అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన షేక్‌హ్యాండ్ విషయంలో వివాదం తలెత్తింది. ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుకు చెందిన ఒక ఆటగాడు, భారత ఆటగాడితో షేక్‌హ్యాండ్ ఇచ్చే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదట షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ముందుకు వెళ్లినట్లు నటించి, ఆ తర్వాత భారత ఆటగాడు చేయి చాచి ఉండటంతో, అయిష్టంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి వెంటనే చేతిని దురుసుగా లాగేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 27న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
India defeats Pakistan 2-0 in Junior Davis Cup
Look at the Pakistan player’s attitude on handshake after loosing, Pathetic Stuff! 😡
pic.twitter.com/5YSkr1Axkv— The Khel India (@TheKhelIndia) May 27, 2025
ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు, నిపుణులు పాకిస్థాన్ ఆటగాడి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి ప్రవర్తన తగదని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, పాక్ ఆటగాడి రెచ్చగొట్టే ప్రవర్తనకు భారత ఆటగాడు సంయమనం పాటించడం ప్రశంసలు అందుకుంది.
ఈ సంఘటన జరిగిన సమయంలో, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతిగా మే 7న భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడా మైదానంలో కూడా ఈ ఉద్రిక్తతలు ప్రతిబింబించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ, క్రీడలు దేశాల మధ్య స్నేహబంధాలను పెంపొందించాలి. కానీ, ఇలాంటి ఘటనలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత క్రీడా అధికారులు ఇలాంటి ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..