ప్రేమలో ఉన్నవారికి ప్రపంచాన్ని మర్చిపోతారు అని అంటూ ఉంటారు. దాన్ని ఈ ప్రేమ జంట నిజంగానే ఆచరించి చూపించింది. పట్టపగలు, అది కూడా బస్సులో అంతా చూస్తున్నారనే సోయి లేకుండా పిచ్చిగా ప్రవర్తించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పైగా వాళ్లిద్దరూ ఒక కాలేజీకి చెందిన వారిలా ఉన్నారు. ఇద్దరి యూనిఫామ్ ఒకేలా ఉంది. ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో కూడా కనీస అవగాహన లేకుండా, ప్రేమికులిద్దరూ బస్సు వెనుక కూర్చుని, కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ ఉండగా, ఎవరో వారి వెర్రి చేష్టలను మొబైల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో yours.jaans అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో, బస్సు వెనుక సీటులో ఒక జత పక్షులు ప్రేమలో ఉన్నట్లు చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి