సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు సహజమే. సినిమా తారలు ఇట్టే ఒకరినొకరు ప్రేమలో పడతారు. అంతలోనే విడిపోతారు. ఆ తర్వాత వారి జీవితంలోకి మరొకరు ఎంటర్ అవుతారు. కొందరు ఈ బ్రేకప్ బాధ నుంచి త్వరగా బయటపడిపోతారు. కానీ మరికొందరు అక్కడే ఉండిపోతారు. ప్రియుడిని మర్చిపోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ మాజీ ప్రియురాలిది కూడా అలాంటి పరిస్థితే. కత్రినా అతని లైఫ్ లోకి రాకముదే విక్కీ ఒక హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించాడు. ఇద్దరూ కూడా కలిసి తిరిగాడు. పలు సందర్భాల్లో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తమ ప్రేమను చాటుకున్నారు. అలాంటిది వారు సడెన్ గా విడిపోయి షాకిచ్చారు. బ్రేకప్ తర్వాత విక్కీ కౌశల్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. ఇప్పుడు వీరిద్దరూ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. కానీ విక్కీని మర్చిపోలేని హీరోయిన్ మాత్రం నిరాశ నిస్పృహలతో ఇప్పటికీ ఒంటరిగానే ఉంటోంది.
విక్కీ కౌశల్ పిచ్చిగా ప్రేమించిన ఆ హీరోయిన్ పేరు హర్లీన్ సేథి. పలు OTT ప్రాజెక్టులలో పనిచేసిందీ అందాల తార. ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ వెబ్ సిరీస్ హర్లీన్ సేథికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపించింది. ఈ సిరీస్ ప్రమోషన్ సమయంలో హర్లీన్ కు మద్దతుగా నిలిచాడు విక్కీ కౌశల్. తన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సమయంలో, హర్లీన్ సినిమాను కూడా ప్రమోట్ చేశాడు.
విక్కీ, హర్లీన్ మొదటిసారి ఒక పార్టీలో కలుసుకున్నారు. ఇక్కడే వారి ప్రేమకథకు పునాది పడింది. హర్లీన్‌ను మొదటిసారి చూసినప్పుడు ఆమెను చూస్తూ ఉండిపోయానని ఆమెతో ఉంటే సమయమే తెలియలేదని విక్కీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రేమ పక్షులు ఉన్నట్లుండి బ్రేకప్ చెప్పుకున్నారు. 2019లో ఈ బ్రేకప్ జరిగింది. అయితే ఇందుకు గల కారణాలను ఒక్కరూ కూడా బయట పెట్టలేదు. బ్రేకప్ గురించి తాను అస్సలు బాధపడటం లేదని హర్లీన్ ఒకసారి చెప్పింది. అయితే తనను విక్కీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అని పిలవడం లేదా ఆమె గురించి మాట్లాడటం తనను బాధపెడుతుందని వాపోయింది.
హర్లీన్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
హర్లీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విక్కీని అకస్మాత్తుగా అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోయారనే చర్చ ప్రారంభమైంది. ఆ సమయంలో, విక్కీ, కత్రినా కైఫ్ మధ్య ప్రేమ కూడా మొదలైందని వార్తలు వచ్చాయి. కత్రినా రాక కారణంగా హర్లీన్ విక్కీకి దూరమైందని చాలా మంది చెబుతారు. విక్కీతో బ్రేకప్ తర్వాత హర్లీన్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. చాలా కాలంగా సినిమాలకు కూడా దూరమైంది. అయితే ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. మళ్లీ తన సిఇమా కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే హార్లీన్ ఇప్పటికీ ఇప్పటికీ ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి