Vedanth Fashions: సక్సెస్ అంటే ఇది కదరా మామ.. రూ.10 వేలతో 32 వేల కోట్ల సామ్రాజ్యం

Vedanth Fashions: సక్సెస్ అంటే ఇది కదరా మామ.. రూ.10 వేలతో 32 వేల కోట్ల సామ్రాజ్యం


వేదాంత్ ఫ్యాషన్స్ 2002లో కోల్‌కతాలో స్థాపించారు. ఈ కంపెనీ మాన్యవర్, మోహే, మంథన్, మెబాజ్, త్వమేవ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ద్వారా అమ్మకాలు సాగిస్తుంది. మోడీ నాయకత్వంలో కంపెనీ కొత్త శిఖరాలకు చేరుకుంది. 2022లో విజయవంతమైన ఐపీఓకు వెళ్లడంతో ఈ విజయం బ్రాండ్ ప్రాముఖ్యతను పెంచడమే కాకుండా భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా మోడీని చేసింది. 

రవి మోడీ వ్యవస్థాపక ప్రయాణం చాలా నిరాడంబరంగా ప్రారంభమైంది. 13 సంవత్సరాల వయస్సులో అతను తన తండ్రి బట్టల దుకాణంలో సేల్స్‌పర్సన్‌గా పని చేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను తన సొంత వ్యాపారం ప్రారంభించటానికి తన తల్లి నుంచి రూ. 10,000 అప్పు తీసుకున్నాడు. అలాగే చివరికి వేదాంత్ ఫ్యాషన్స్‌ని స్థాపించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మాన్యవర్ షోరూమ్స్‌ను స్థాపించాడు. అలా పెళ్లి, పండుగ దుస్తులకు కొనుగోలు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌గా స్థిరపడింది. మాన్యవర్ షోరూమ్‌లో కుర్తాలు, షేర్వాణీలు, జాకెట్లు, లెహంగాలు, చీరలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, రణవీర్ సింగ్, అలియా భట్, కార్తీక్ ఆర్యన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ బ్రాండ్ యాడ్స్ చేయడంతో మాన్యవర్ ద్వారా బ్రాండ్ మరింత ప్రజాదరణ పొందింది.

వేదాంత్ ఫ్యాషన్స్ భారతదేశంలోని 248 నగరాల్లో 662 దుకాణాలు, 16 అంతర్జాతీయ అవుట్‌లెట్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.32,000 కోట్లు కాగా , మోదీ వ్యక్తిగత నికర విలువ దాదాపు రూ.28,000 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 2023 నాటికి అతను భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 64వ స్థానంలో, ఫోర్బ్స్‌కు సంబంధించిన  ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 1,238వ స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *