ఏనుగు తొండం: ఏనుగు తొండం ఎత్తైనదిగా ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆనందాన్ని వ్యక్తపరచడానికి, స్నేహితులను పలకరించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రవేశ ద్వారం వద్ద ఏనుగులు పెట్టినప్పుడు.. అవి పైకి తొండం ఉండేవిగా చూసుకోవాలి. ఇలాంటి తొండం ఉన్న ఏనుగు ఇంట్లోకి సానుకూల శక్తిని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. తొండం క్రిందికి ఉంచిన ఏనుగు దీర్ఘాయువు, సంతానోత్పత్తి, స్థిరత్వానికి చిహ్నం. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల స్థిరత్వం, సామరస్యం పెంపొందుతాయి.