Headlines

Urfi Javed : నా డ్రెస్సు అమ్ముతున్నాను.. ధర రూ.3 కోట్ల 66 లక్షలు.. ఉర్ఫీ జావేద్ పోస్ట్..

Urfi Javed : నా డ్రెస్సు అమ్ముతున్నాను.. ధర రూ.3 కోట్ల 66 లక్షలు.. ఉర్ఫీ జావేద్ పోస్ట్..


సాధారణంగా సినీతారల ఉపయోగించిన వస్తువులు, దుస్తులు వేలం వేస్తుంటారు. అయితే వాటిని లక్షల్లో, కోట్లలో కొనుగోలు చేస్తుంటారు. గతంలో నిషా కళ్ల చిన్నది సిల్క్ స్మిత సగం తిన్న ఆపిల్ పండును సైతం వేలం వేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన కొత్త డ్రెస్సును అమ్ముతాను అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్, సోషల్ మీడియాతోపాటు, పలు టెలివిజన్ షోలలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఉర్ఫీ జావేద్.. బోల్డ్ గా కనిపిస్తూ.. కొత్త కొత్త వెరైటీ డ్రస్సులతో హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడు క్రేజీ ఫోటోషూట్స్, డ్రెస్సింగ్ పై నిత్యం చాలా మంది విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ ఓ డ్రెస్సు విషయంలో మాత్రం ఈ బ్యూటీ పై ప్రశంసలు కురిపించారు.

అదే బ్లాక్ అండ్ గ్రీన్ బట్టర్ ఫ్లై డ్రెస్. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ టైప్ డ్రెస్ ను వేసుకుని ఉర్ఫీ గతంలో ఫోటోస్ దిగిన సంగతి తెలిసిందే. ఆ డ్రెస్ పై పువ్వులు, ఆకులతోపాటు బట్టర్ ఫ్లైస్ కనిపిస్తూ చూడడానికి ఎంతో అందంగా కనిపించింది. ఇప్పుడు అదే డ్రెస్సును అమ్ముతున్నట్లు ప్రకటించింది ఉర్ఫీ. ఆ డ్రెస్ ధర కేవలం రూ.3 కోట్ల 66 లక్షల 99 వేలు మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉర్ఫీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఉర్ఫీ పెట్టిన పోస్ట్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. ఒక్క డ్రెస్ ఏకంగా రూ.3 కోట్లకు పైన ధర ఉంటుందా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ విషయంలో మాత్రం కొందరు ఉర్ఫీని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఉర్ఫీ మాత్రం తన డ్రెస్ అమ్మడానికి గల రీజన్ మాత్రం వెల్లడించలేదు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *