హైదరాబాద్, జులై 16: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పరీక్షల తేదీలను యూపీఎస్సీ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షలు ఆగస్టు 22 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 14,161 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ 2025లో అర్హత సాధించారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2025 పరీక్షల షెడ్యూల్ ఇదే..
- ఆగస్టు 22 : ఎస్సే పేపర్
- ఆగస్టు 23 : జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2
- ఆగస్టు 24 : జనరల్ స్టడీస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 4
- ఆగస్టు 30 : ఇండియన్ లాంగ్వేజ్ పేపర్, ఇంగ్లిష్
- ఆగస్టు 31 : ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2
ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ పరీక్షలు 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షలు 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఇంటర్వ్యూలకు ఎంపికవుతారు. కాగా ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను కమిషన్ ఎంపిక చేయనుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.