Upcoming Movies: ఈవారం థియేటర్/ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. కమల్ హాసన్ నుంచి థగ్ లైఫ్ నుంచి..

Upcoming Movies: ఈవారం థియేటర్/ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. కమల్ హాసన్ నుంచి థగ్ లైఫ్ నుంచి..


జూన్ నెల వచ్చేసింది.. ఇక ఈనెలలో పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోకి రానున్నాయి. చాలా కాలంగా అడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాలు ఇప్పుడు విడుదల కానున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాతోపాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఇటు ఓటీటీల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను మెప్పించనున్నాయి. ఇంతకీ జూన్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

థగ్ లైఫ్..

డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమా థగ్ లైఫ్. ఇందులో త్రిష, అభిరామి, శింబు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నాయకన్ సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ నెలకొంది. జూన్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

శ్రీశీశ్రీ రాజావారు..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నార్నె నితిన్. ఆయన హీరోగా రూపొందిన తొలి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు. సంపద కథానాయికగా నటించగా.. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు. 2022లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఆలస్యంగా విడుదలవుతుంది. జూన్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది.

వీటితోపాటు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం హౌస్ ఫుల్ 5. జూన్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అలాగే సంగీత్ శోభన్ హీరోగా రూపొందించిన గ్యాంబ్లర్స్ మూవీ జూన్ 6న రిలీజ్ కానుంది.
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి కలిసి నటించిన బద్మాషులు సినిమా జూన్ 6న రిలీజ్ కానుంది.

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..
వన్ ఆఫ్ ది దెమ్ డేస్.. హాలీవుడ్.. జూన్ 4
జాబ్.. హిందీ.. జూన్ 5

అమెజాన్ ప్రైమ్..

స్టోలెన్.. హిందీ.. జూన్ 4

జియో హాట్ స్టార్..

టూరిస్ట్ ఫ్యామిలీ.. తమిళం, తెలుగు.. జూన్ 2
గజానా.. హిందీ.. జూన్ 2
దేవికా అండ్ డాని.. తెలుగు.. జూన్ 6

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *