UK Heatwave: అమ్మబాబోయ్.. ప్రాణాంతక హీట్‌వేవ్.. 7 రోజుల్లో 600 మంది చనిపోయే అవకాశం..

UK Heatwave: అమ్మబాబోయ్.. ప్రాణాంతక హీట్‌వేవ్.. 7 రోజుల్లో 600 మంది చనిపోయే అవకాశం..


హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్రిటన్‌ ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలకు వారంరోజుల్లో 600 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో యూకే వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా లండన్‌లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ 34 డిగ్రీలను దాటింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోఫికల్ మెడిసిన్, ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా విడుదలచేసిన రిపోర్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. యూకేలో నమోదైన దశాబ్దాలనాటి గణాంకాలను ఉపయోగించి తమ అంచనాలను రూపొందించామంటున్నారు. హీట్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పు గురించి ఇంగ్లండ్, వేల్స్‌ సహా స్కాంట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌ ప్రజలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. మృతుల్లో సగం మంది లండన్ వాసులుంటారని.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. ఈయూ దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్‌ కూడా హీట్ వేవ్‌తో సతమతమవుతున్నాయి. ఇలాంటి హీట్ వేవ్ 50 ఏళ్లలో ఒకసారి సంభవిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. యూకేలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణంగా 10 డిగ్రీల నుంచి 17డిగ్రీలవరకు ఉంటుంది. వాతావరణంలో అసాధరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతోంది. స్పెయిన్‌, ప్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

శీతల దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, యూకేల్లో ఉష్ణోగ్రతుల కొన్ని డిగ్రీలు పెరిగితే వారి శరీరాలు తట్టుకోవని చెబుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారు హీట్ వేవ్‌కు గురైతే ఆనారోగ్యం పాలవుతారంటున్నారు. 65 ఏళ్లదాటిన వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులకు హీట్ వేవ్ ప్రాణాంతకం అవుతుందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *