Tollywood:12 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు.. రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?

Tollywood:12 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు.. రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?


ఒకప్పుడు మన దేశంలో సినిమాల కంటే సీరియళ్లకే ఎక్కువ ఆదరణ ఉండేది. హిందీలో అయితే ‘రామాయణం’, ‘ఓం నమః శివాయ’, ‘మహాభారతం’, ‘అలీఫ్ లైలా’, ‘శక్తిమాన్’ తదితర సీరియల్స్ కు మంచి ఆదరణ దక్కింది. ఇక తెలుగులో అయితే అంతరంగాలు, అన్వేషిత, విధి, మర్మదేశం తదితర సీరియల్స్ ఏళ్ల తరబడి తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాయి. ఈ జాబితాలో ‘క్యుంకీ సాస్ బి కభీ బహు థీ’ అనే హిందీ సీరియల్ కూడా ఉంది. భారతీయ టెలివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఈ సీరియల్ కూడా ఒకటి. 2000లో ప్రారంభమైన ఈ సీరియల్ సుమారు 8 ఏళ్ల పాటు అంటే 2008 వరకు కొనసాగింది. ఒక కుటుంబంలోని మూడు తరాల గురించి చెప్పిన ఈ సీరియల్ అప్పట్లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. ఇదే సీరియల్ లో కేంద్ర మాజీ మంత్రి, బిజెపి జాతీయ నాయకురాలు స్మృతి ఇరానీ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇందులో ఆమె తులసి విరానీ పాత్రను పోషించి ఇంటిల్లిపాదికి చేరువయ్యారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ సొంత నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈ సీరియల్ ను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ‘క్యుంకీ సాస్ బి కభీ బహు థీ’ సీరియల్ రెండవ సీజన్ షూటింగ్ ప్రారంభమైంది. స్మృతి ఇరానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. స్మృతి ఇరానీ చివరిసారిగా 2013లో ఒక సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె తనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన అదే టీవీ ప్రపంచంలోకి తిరిగి వచ్చారు. అది కూడా తన ఫేమస్ సీరియల్ ద్వారా.

‘క్యుంకీ సాస్ బి కభీ బహు థీ’ సీరియల్‌ ఫస్ట్ పార్ట్ ను నిర్మించిన ఏక్తా కపూర్ నే రెండవ సీజన్‌ను కూడా నిర్మిస్తున్నారు. అయితే రెండవ సీజన్ భిన్నంగా ఉంటుంది. చిత్రీకరణ సమయంలో కూడా కఠిన నియమాలు, ఆంక్షల విధించారు. చిత్రీకరణ ప్రదేశంలో మొబైల్ ఫోన్ వాడకానికి అనుమతి లేదు. అలాగే స్మృతి ఇరానీ చిత్రీకరణ సమయంలో ఆమెకు Z కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఈ సీరియల్‌లో స్మృతి ఇరానీతో పాటు, మొదటి సీజన్‌లో ఆమె భర్తగా నటించిన అమర్ ఉపాధ్యాయ్ కూడా కనిపిస్తారు. బాలీవుడ్ స్టార్ మౌని రాయ్ సహా కొంతమంది కొత్త నటీనటులు ఈ సీరియ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.

మహా కాలేశ్వర్ టెంపుల్ లో స్మృతి ఇరానీ..

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *