
సినిమా ప్రపంచం అంటే అందమైన కలలు, అద్భుతమైన ఆశలు. కానీ ఈ రంగంలో నిలబడటమే నిజంగా కష్టమే. అనేక మంది ఓవర్‌నైట్ స్టార్ అవుతారు. కానీ ఆ మ్యాజిక్‌ను నిలబెట్టుకోగల వాళ్లే కొద్దిమందే. చాలామంది అందం, టాలెంట్ ఉన్నా, సరైన ఆప్షన్స్ ఎంచుకోలేక కనుమరుగు అవుతూ ఉంటారు. ఆ కోవకు చెందిన నటి రిచా పల్లోడ్. నువ్వే కావాలి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో తరుణ్ పక్కన రిచా నటించింది. వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీకి అప్పట్లో యూత్ ఫిధా అయిపోయారు. సినిమాతో రిచా ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత.. హోలీ, చిరుజల్లు, ప్రేమతో రా, నాకు మనసిస్తా రా అంటూ కొన్ని హిట్ మూవీస్ చేసింది రిచా. కానీ తర్వాత తన ఇమేజ్ మాత్రం కొనసాగించలేకపోయింది.
రిచా పల్లోడ్ బెంగళూరులో జన్మించింది. చిన్నవయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగు పెట్టింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ.. భారీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. 2011లో హిమాన్షు బజాజ్‌ని పెళ్లి చేసుకొని.. లైఫ్‌కి ఓ కొత్త స్టార్ట్ ఇచ్చింది. 2016లో ‘మలుపు’ సినిమా చేసింది, ఆ తర్వాత వెండితెరకి దూరమైంది.
2020లో యుఆర్ హానర్ అనే వెబ్ సిరీస్‌లో రిచా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఆమె కూల్‌గా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే ఆమె అందం మాత్రం చెక్కుచెదరలేదు. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు చూస్తున్న నెటిజన్స్.. మేడం సార్ మేడం అంతే కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram