డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ, యూత్ మెచ్చే కథలను మరింత అందంగా వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన నేర్పరి. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన కథలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో హ్యాపీ డేస్ ఒకటి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ను శేఖర్ కమ్ముల చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుుకంది. ముఖ్యంగా ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ వరుణ్ సందేశ్, మిల్కీ బ్యూటీ తమన్నా. అదే స్థాయిలో హీరో నిఖిల్ సైతం ఫేమస్ అయ్యారు. ఈ చిత్రంలో తమదైన నటనతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో అప్పు ఒకరు.
హ్యాపీడేస్ సినిమాలో నిఖిల్ జోడిగా కనిపించింది అప్పు.. టామ్ బాయ్ గెటప్ లో కనిపించింది అప్పు. ఆమె అసలు పేరు గాయత్రీ రావు. ఈ సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. హ్యాపీడేస్ తర్వాత ఆమెకు ఆ స్థాయిలో మరో అవకాశమే రాలేదు. గాయత్రీ రావు సైతం సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ సినీనటులు కావడం విశేషం. గాయత్రీ రావు తల్లి బెంగుళూరు పద్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు.
ఇక హ్యాపీడేస్ తర్వాత గాయత్రీకి అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. కొన్ని రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది గాయత్రి. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాల తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత మరెక్కడ కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది అప్పు.
ఇవి కూడా చదవండి

Gayathri Rao
ఇవి కూడా చదవండి :
Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..