ఒకప్పుడు ఆమె బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన నటి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టీవీ పరిశ్రమను ఒక్క పాత్రతోనే ఏలింది. అద్భుతమైన యాక్టింగ్, చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు అదే సీరియల్ తిరిగి వస్తుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ సీరియల్ నటి తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సీరియల్ పేరెంటో తెలుసా.. ? అదే తులసి విరానీ. ఇప్పుడు కొత్త కథాంశంతో తిరిగి రాబోతుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న స్మృతి ఇరానీ.. ఇప్పుడు ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో రీఎంట్రీఇస్తుంది. జూలై 29న రాత్రి 10:30 గంటలకు స్టార్ ప్లస్‌లో ప్రీమియర్ అయ్యే క్యుంకీ సాస్ భీ కభీ బహు థి రీబూట్‌లో కీలకపాత్రలో కనిపించనున్నారు. 2000 సంవత్సరంలో అసలు షో ప్రసారమైనప్పుడు స్మృతి ఇరానీ ఒక్క ఎపిసోడ్ కోసం కేవలం రూ.1800 మాత్రమే తీసుకుందట.
కానీ ఇప్పుడు ఆమె ఎపిసోడ్‌కు రూ. 14 లక్షల ఫీజును అందుకుంటుందని.. ఇది టీవీ చరిత్రలోనే అత్యధికం అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సీరియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. గతంలో ఫేమస్ అయిన తులసి పాత్రలోనే మరోసారి మెప్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
అయితే తాజా సమాచారం ప్రకరం.. ఈ సీరియల్ లో స్మృతి ఇరానీ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనుందని టాక్. గతంలో ఇరానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని అన్నారు. తాను మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు రూ.1800 మాత్రమే అందుకున్నట్లు తెలిపారు. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఇరానీ..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు.

Smriti Irani Pic
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..