టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ జిమ్ దుస్తులపై ఫోటోలకు ఫోజులిచ్చింది. నాకు మెరిసే నక్షత్రం అవసరం లేదు. నన్ను రక్షించాలని కూడా కోరుకోవడం లేదు. నాకు యువరాజు కూడా వద్దు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా…?
ఆ వయ్యారి మరెవరో కాదండి.. టాలీవుడ్ నటి దివి వైధ్య. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతకు ముంది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కానీ అంతగా ఫేమస్ కాలేదు.
బిగ్ బాస్ రియాల్టీ షోలో అందం, అల్లరి, అమాయకత్వంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. హౌస్ లో దాదాపు 49 రోజులు గడిపింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది.
అలాగే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సైతం పెరిగిపోయింది. ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే లంబసింగి సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకుంటున్న దివి.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.