మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతోపాటు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాదు.. నాలుగు నెలల్లోనే మూడు సినిమాలతో ఏకంగా రూ.3వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆమె అడుగుపెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెప్పాల్సిందే. హీరో ఎవరైనా సరే… ఆమె జోడి కట్టిందంటే వంద కోట్లు దాటాల్సిందే. కేవలం గ్లామర్ షో మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ బ్యూటీతో నటిస్తే పక్కా సూపర్ హిట్ అనే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఆమె మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో ఇప్పుడు తిరుగులేని హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా.
రష్మిక మందన్నా… కిరిక్ పార్టీ అంటూ కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల ఆమె నటించిన పుష్ప 2 సినిమా గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంటే ఏడాదిలోపే రూ.2600 కోట్లు వసూళ్లు రాబట్టింది.
ఇక ఈద్ సందర్భంగా సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎంతలేదనుకున్న మూడు, నాలుగు కోట్ల వరకు రాబట్టడం ఖాయమంటున్నారు నిపుణులు. దీంతో నాలుగు నెలల వ్యవధిలోనే మూడు వేల కోట్ల వసూళ్లు చేసిన హీరోయిన్ గా రష్మిక చరిత్ర సృష్టించనుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడు తోపు హీరోయిన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఇప్పుడు రష్మిక పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..