Tollywood: ఫొటో స్టిల్ కాదు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ పిల్లన గ్రోవిని ఎంత బాగా వాయించిందో మీరే చూడండి.. వీడియో

Tollywood: ఫొటో స్టిల్ కాదు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ పిల్లన గ్రోవిని ఎంత బాగా వాయించిందో మీరే చూడండి.. వీడియో


దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (ఆగస్టు 16) చాలా మంది తమ బిడ్డలను శ్రీకృష్ణుడిగా ముస్తాబు చేశారు. ఇక అమ్మాయిలను అయితే రాధ, గోపికలుగా తయారు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు. ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. తమకు తోచిన విధంగా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా గోపికగా ఎంతో అందంగా ముస్తాబైంది. అంతేకాదు కృష్ణుని వలే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫొటో కోసమే అలా స్టిల్‌ ఇచ్చిందనుకునేరు. అసలు కాదు పిల్లన గ్రోవితో అద్భుతంగా ఓ పాట ట్యూన్‌ కూడా వినిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే. క్షణాల్లో అవి వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు ‘మీరు మల్టీటాలెంటెడ్’‌ అని తెగ మెచ్చుకుంటున్నారు.

కాగా సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన కాలంలో ఫ్లూట్‌ నేర్చుకుంది. అలాగే కళరిపయట్టు, కర్ర విన్యాసాలు నేర్చుకుంది. అప్పుడప్పుడూ వాటిని సాధన చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని పిల్లన గ్రోవిని అద్భుతంగా వాయించింది. అందరితో మల్టీ ట్యాలెంటెడ్ అని ప్రశంసలు అందుకుంది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరనుకున్నారు? హార్ట్ అటాక్ హీరోయిన్ అదా శర్మ.

ఇవి కూడా చదవండి

పిల్లనగ్రోవిని వాయిస్తోన్న అదాశర్మ.. వీడియో

శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది అదాశర్మ. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఉట్టి కూడా కొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలోషేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి.

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొడుతోన్న అదా శర్మ.. వీడియో..

కాగా అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీకి ఇటీవల జాతీయ అవార్డు దక్కింది. కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *