ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇక అతడు నటించిన సినిమా వచ్చిందంటే థియేటర్లలో పండగే.. దాదాపు రెండు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఈ హీరో కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. ప్రజా సేవ కోసం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అతడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ హీరో రాబోయే సినిమాలపై భారీ హైప్ ఉంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? అతడు మరెవరో కాదండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా మెప్పించిన పవర్ స్టార్.. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమా పవన్ కెరీర్ మలుపు తిప్పింది. ఆ తర్వాత ఖుషి, జానీ వంటి సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి చిత్రాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. త్వరలోనే తన తదుపరి చిత్రాల షూటింగ్స్ కంప్లట్ చేయనున్నారు. పవర్ స్టార్ నటించనున్న సినిమాల పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్మెన్గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..