కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు తెలుగు హీరో సతీమణి. అచ్చ తెలుగు అమ్మాయి. అయినప్పటికీ హిందీ భాషలోనే సినీరంగప్రవేశం చేసింది. తెలుగు,తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.
ఈరోజు (మే 31) శోభిత పుట్టినరోజు. 2016లో ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.శోభితా ధూళిపాళ 2013 సంవత్సరంలో ‘మిస్ ఇండియా ఎర్త్’ టైటిల్ గెలుచుకుంది. మోడలింగ్ ప్రపంచం నుండి నటనలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లల్లో హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. వరుసగా నాలుగు హిందీ చిత్రాలలో నటించినప్పటికీ అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. గూడాఛారి, మేజర్ చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
2019లో విడుదలైన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ ద్వారా ఆమె ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ‘ది నైట్ మేనేజర్’ చిత్రానికి శోభిత ప్రశంసలు అందుకుంది. శోభిత 2016 నుండి మొత్తం 13 సినిమాలు, 3 సిరీస్‌లలో పనిచేసింది. శోభితా ధూళిపాళ 2024లో ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ చిత్రం నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకు కేవలం 13 చిత్రాల్ల నటించింది. ఒక్కో సినిమాకు 70 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్స్ ఎండార్స్మెంట్ కోసం రూ.10 కోట్లు తీసుకుంటుంది. నివేదికల ప్రకారం శోభిత ఆస్తులు రూ.164 కోట్లు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..