Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?


టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి ఆతర్వాత కనబడకుండా మాయం అవుతుంటారు. చాలా మంది భామలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. అయితే ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు.? ఏం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ తెగ వెతుకుంటూ ఉంటారు. ఇలా ఆరా తీయడంతో చాలా మంది హీరోయిన్స్ గురించి ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. అయితే  హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంతమంది హీరోలను, నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు. అయితే తక్కువ మంది మాత్రమే రాజకీయనాయకులను వివాహం చేసుకున్నారు. అలాగే  పైన కనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ కూడా ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

ఆయన చిన్న చితకా రాజకీయనాయకుడు కాదు.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి.. ఆతర్వాత ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనే హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి. కన్నడ రాజకీయాల్లో ఆయన తెలియని వారు ఉండరు. అక్కడ ఆయన చాలా పవర్ ఫుల్ లీడర్. అయితే ఆయన భార్య గురించి చాలా మందికి తెలియకపోవొచ్చు ఆమె మన టాలీవుడ్ హీరోయిన్.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

అందం అభినయం కలబోసినా ఆమె తన సినిమాలతో మెప్పించారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?కుమార స్వామి భార్య పేరు రాధిక కుమారస్వామి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది. రాధికా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమా చేసే సమయంలో ఆమె 9వ తరగతి చదువుతుంది. కన్నడ బాషాలో వరుసగా సినిమాలు చేసిన ఆమె తెలుగులో దివంగత నటుడు నందమూరి తారక రత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది రాధికా. 2018 వరకు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక కుమార స్వామిని ఆమె రెండో  పెళ్లి చేసింది. అంతకు ముందే కుమార స్వామికి పెళ్లైంది. పెళ్లి  తర్వాత నటనకు దూరం అయ్యింది. కానీ నిర్మాతగా సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *