పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే చాలా ఫేమస్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ కుర్రాడికి క్రేజ్ ఉంది. అలాగనీ ఇతను స్టార్ హీరో కాదు. కానీ ఇతను సినిమాలో భాగమైతే చాలు.. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వుద్ది. అదే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అందుకే స్టార్ హీరోలు, పేరున్న దర్శక నిర్మాతలు సైతం తమ సినిమాలకు ఈ అబ్బాయినే తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే బాగా డిమాండ్ ఉన్న సినిమా సెలబ్రిటీల్లో ఈ అబ్బాయి కూడా ఒకడు. అలాగే రెమ్యునరేషన్ అత్యధికంగా తీసుకునే వారిలో కూడా టాప్ లోనే ఉంటున్నాడు. తన ట్యాలెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతోన్న ఆ పిల్లాడు మరెవరో కాదు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. గురువారం (జులై 31) రిలీజైన కింగ్ డమ్ సినిమాకు అతనే స్వరాలు సమకూర్చాడు. ఈ నేపథ్యంలో ఈ బక్కోడోకి సంబంధించిన పలు ఆసక్తికర ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ధనుష్ ఆలపించిన ‘వై దిస్ కొలవేరి సాంగ్’ తో బాగా ఫేమస్ అయ్యాడు అనిరుధ్. 2012లో వచ్చిన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 450 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అప్పటికింకాగా అనిరుధ్ వయసు కేవలం 22 సంవత్సరాలే. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడీ మ్యూజిక్ సెన్సేషన్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి సినిమాకు మొదట బాణీలు అందించాడు అనిరుధ్. ఆ తర్వాత నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవర వంటి సూపర్ హిట్ సినిమాలకు స్వరాలు సమకూర్చాడు. ఇప్పుడు కింగ్ డమ్ సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు.
ఇవి కూడా చదవండి
కింగ్ డమ్ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండతో కలిసి..
34 ఏళ్ల అనిరుధ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12-15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. పాటలతో పాటు అప్పుడప్పుడూ డేటింగ్, లవ్ రూమర్లతోనూ వార్తల్లో నిలుస్తుంటాడీ సింగింగ్ సెన్సేషన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి