
పై డియోడ్రెంట్ యాడ్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? చాలామంది హీరోయిన్ల లాగే ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసింది. వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ లో నటించింది. జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొకోనట్ అయిల్, సంతూర్ ME డియోడరెంట్ తదితర టీవీ వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అలాగే ‘బ్లూయి ఇండియా’కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఈ హీరోయిన్ అందం, అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మ్యాచో స్టార్ గోపీచంద్, సుధీర్ బాబు వంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. అందులో ఒకటి ,రెండు సినిమాలు హిట్ కూడా అయ్యాయి. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం క్రేజ్ రాలేదు. తమిళంలో ఒక సినిమా చేయగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది. అయినా హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. అన్నట్లు ఈ బ్యూటీ మల్టీపుల్ ట్యాలెంటెడ్. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ‘సినిమాల్లో నటించడమూ తెలుసు.. నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించడమూ తెలుసు’ అంటోన్న ఈ బ్యూటీ మరెవరో కాదు నేల టిక్కెట్ హీరోయిన్ మాళవిక శర్మ.
మాళవిక చివరిసారిగా సుధీర్ బాబుతో కలిసి హరోంహర అనే సినిమాలో నటించింది. గతేడాది ఈ మూవీ రిలీజై ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఆ తర్వాత మరే మూవీలోనూ ఈ బ్యూటీ కనిపించలేదు.అలాగే తన కొత్త సినిమాల గురించి కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.
మాళవిక శర్మ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ అందాల తార ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అలాగే వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram