Tollywood: ఈ ఏడాదిలోనే పెద్ద అట్టర్ ప్లాప్.. ఓటీటీని ఊపేస్తోన్న సినిమా.. క్లైమాక్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

Tollywood: ఈ ఏడాదిలోనే పెద్ద అట్టర్ ప్లాప్.. ఓటీటీని ఊపేస్తోన్న సినిమా.. క్లైమాక్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..


సాధారణంగా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న చిత్రాల జాబితా మారుతూనే ఉంటుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అడియన్స్ ఆసక్తి చూపిస్తున్న సినిమాలను, వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో సినిమాలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుంటాయి. కానీ ఇప్పుడు మీకు తెలుసా.. ? ఈ ఏడాదిలో థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఈ ప్లాప్ సినిమా ఇప్పుడు ఓటీటీనే ఊపేస్తోంది. అదే ‘దేవా.’ 2025 సంవత్సరంలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే పూజా హెగ్డే, కుబ్రా సైట్, పావైల్ గులాటి, ప్రవేశ్ రాణా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రలో నటించాడు.

బాలీవుడ్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దేవా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. ఎవరి మాట వినని అతడు తనకు నచ్చింది మాత్రమే చేస్తుంటాడు. కానీ అతని స్నేహితుడిని కాల్చి చంపినప్పుడు ఈ కథలో అసలైన మలుపు తిరుగుతుంది. ఈ కేసును దేవా తీసుకుంటాడు. హంతకుడిని కనుగొన్న తర్వాత జరిగిన ఓ ప్రమాదంలో దేవా జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. సినిమా మొత్తంలో అసలు హంతకుడే కనిపించడు. కానీ క్లైమాక్స్ చూస్తే మాత్రం మీ బుర్ర తిరిగిపోద్ది. అనుక్షణం బలమైన సస్పెన్స్, ఊహించని మలుపులు తిరుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక పాత్ర మీకు ఊహించని షాకిచ్చింది.

దేవా సినిమా మార్చి 28న ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ 10 జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం దేవా మొదటి స్థానంలో, రెండవ స్థానంలో క్రావెన్, తమిళం మూవీ డ్రాగన్ మూడవ సినిమాగా ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. రూ.60 కోట్లతో నిర్మించిన ఈచిత్రం రూ.34.18 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.56.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *