పై ఫొటోను చూశారా? అందులో ఉన్న ఇద్దరమ్మాయిల్లో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. చాలా మంది అబ్బాయిల ఫేవరెట్ హీరోయిన్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్నీ హిట్టే. బాలీవుడ్ లోనూ పలువురు స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ చిత్రాలు చేసింది. చాలా మంది స్టార్స్ లాగే ఈ బ్యూటీ కూడా మొదట బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకుంది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత మరాఠి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆపై హిందీ, తెలుగు సినిమాల్లోనూ అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. హిందీలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ తదితర హీరోల సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్స్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ప్రజెంట్ ఈ పాన్ ఇండియా హీరోయిన్ చేతిలో సుమారు అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అందులో ఒకరు మృణాళ్ ఠాకూర్. యెల్లో కలర్ డ్రెస్ లో ఉన్నది తనే.
శుక్రవారం (ఆగస్టు 31) మృణాళ్ ఠాకూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు ముందస్తు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో మృణాళ్ కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో అదే.
ఇవి కూడా చదవండి
డెకాయిట్ సెట్ లో మృణాళ్ బర్త్ డే వేడుకలు..
Happy Birthday JULIET ❤️🔥
Celebrating early on the sets of #DACOIT 🔥@mrunal0801 pic.twitter.com/YqyyGyAn0H— Adivi Sesh (@AdiviSesh) July 30, 2025
ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది మృణాళ్. షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఆగస్టు 1న మృణాల్ పుట్టినరోజు కావడంతో ఆమెకు ఈ మూవీ సెట్లో ప్రీబర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. ఆమెకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి టీమ్ సభ్యులంతా తలుపు కొట్టి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
— Adivi Sesh (@AdiviSesh) July 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి