
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోందీ అందాల తార. ముఖ్యంగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల తీయాలంటే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. మొదట టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్, ఆపై బాలీవుడ్.. ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇప్పుడే ఈ హీరోయిన్ కే క్రేజ్, డిమాండ్ ఎక్కువగా ఉంది. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ అందాల తార అప్పుడప్పుడూ ప్రతిష్టాత్మక మ్యాగజైన్‌ల కవర్ పేజీలపై కూడా కనిపిస్తోంది. అలా తాజాగా ‘డర్టీ కట్ 25’ మ్యాగజైన్ కవర్ కోసం ఈ అందాల తార చేసిన ఫోటోషూట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో హీరోయిన్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో ఆమె ఎర్రటి లిప్ స్టిక్ వేసుకుని కనిపించింది. అలాగే హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లకు ఈ గెటప్ బాగా నచ్చుతోంది. నటి అమలా పాల్ కూడా ఈ లుక్ చూసి ముగ్ధురాలైంది. అదే సమయంలో కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఇటీవల కుబేరతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకన్నరష్మిక మందన్నా.
రష్మిక మందన్న ఇప్పటికే చాలా ఫోటోషూట్లు చేసింది. కానీ ఈ గెటప్‌లో కనిపించడం ఇదే తొలిసారి. కాబట్టి అభిమానులు దీనిని కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫ్యాషన్ సంబంధిత మ్యాగజైన్ ‘డర్టీ కట్ 25’ కోసం రష్మిక ఇలా కనిపించింది. సినీ పరిశ్రమలో రష్మిక సాధించిన విజయాలను ఈ మ్యాగజైన్ లో ప్రత్యేకంగా ప్రశంసించారు. కాగా ఇటీవల రష్మిక అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. కొడగు నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి నటి తానేనని ఆమె చెప్పింది. దీనిని చాలా మంది తప్పు పట్టారు. ప్రేమ, హర్షిక పూనాచ, శ్వేత చంగప్ప, అశ్విని నాచప్ప వంటి ప్రముఖులు రష్మిక కంటే ముందే చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
డర్టీ మ్యాగజైన్ కోసం..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2, చావా , లేటెస్ట్ గా కుబేర సినిమాలతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.